చక్కెర ధర ెపెరగడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ (ఎన్‌సిపి) ఓ చిట్కా చెప్పింది. ‘చక్కెర తక్కువగా వాడండి. దాన్ని తీసుకోనంత మాత్రాన ఎవరూ చనిపోరు. పైగా చక్కెరతో చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఎక్కువవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కెర వాడాలనేం లేదు’ అని ఎన్.సి.పి. పత్రిక ‘రాష్టవ్రాది’ రాసింది. ‘మితిమీరి చక్కెరను ఉప్పును తీసుకోవడం విషతుల్యమని డాక్టర్లు చెబుతున్నారు’ అని ఆ సంపాదకీయంలో రాశారు. ఎన్.సి.పి. మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మధుకర్ పిఛాడ్ ఈ పత్రిక మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. ధరలు పెరగడంపై శనివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో శరద్‌పవార్‌పై ఒక్కుమ్మడిగా విమర్శలు వెల్లువెత్తడంతో పార్టీ పత్రిక వెంటనే స్పందించింది. ‘పిఛాడ్ వ్యాఖ్య ఆయన వ్యక్తిగతం. పార్టీకి సంబంధం లేదు’ అని రాష్ట్ర ఎన్‌సిపి ప్రతినిధి గురునాథ్ కుల్‌కర్ణి చెప్పారు.‘రాష్టవ్రాది’ పత్రిక సంపాదకీయంలో చక్కెరపై చేసిన వ్యాఖ్యపై వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ స్పందిస్తూ- అది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కాదన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:sugar,rates, Political, Entertainment, Telugu
|