త్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ముస్లింలు గర్జించారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న తెలంగాణకు విముక్తి కల్పించాలని వారు నినదించారు. మేముసైతం తెలంగాణ కోసం పోరాడుతున్నామంటూ గర్జనకు హాజరైన ముస్లిం మహిళలు పూర్తి మద్దతు ప్రకటించారు. జమాతే ఇస్లామి హింద్ సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో నిర్వహించిన ‘తెలంగాణ గర్జన’కు ముస్లింలు వేల సంఖ్యలో హాజరై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం డిమాండ్ చేశారు.
గర్జనలో పాల్గొన్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ పార్టీల జేఏసీి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత డా.నాగం జనార్ధన్‌రెడ్డి మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ ప్రజాగాయకుడు గద్దర్ జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు మాలిక్ మోటా సింగ్ ఖాన్ ఎంపీలు మధు యాష్కీ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి దామోదర్‌రెడ్డి నర్సింహరెడ్డి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రొఫెసర్ కంచె ఐలయ్య రమామేల్కోటే వివిధ ముస్లిం సంఘాల నాయకులు వివిధ ఉర్దూ దినపత్రికలకు చెందిన ఎడిటర్లు పాల్గొని తెలంగాణ ఆవశ్యకత వెనుకబాటుతనం సీమాంధ్రుల దోపిడీని వివరించారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:telangana,muslims, Political, Entertainment, Telugu
|