జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ జిల్లాలో అదుర్స్ సినిమాను సూపర్ హిట్ చేసిన అభిమానులు ఇపుడు తిరగబడ్డారు. చిత్ర నిర్మాత ఆదివారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఆదుర్స్ సినిమాను మరోసారి అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో సినిమా థియేటర్ల యజమానులు స్వచ్ఛందంగా అదుర్స్ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. నాగర్ కర్నూలులో అదుర్స్ ప్రదర్శనను తెలంగాణావాదులు అడ్డుకున్నారు. పోస్టర్లు దహనం చేశారు. సిద్దిపేట మెదక్ రంగారెడ్డి జిల్లాల్లో కూడా అదుర్స్ సినిమాను అడ్డుకున్నారు. తెలంగాణ జిల్లాల్లో అదుర్స్ సినిమా విజయవంతం కావడంతో సమైక్యవాదమే గెలిచిందని ఆనాడు బెదిరింపులకు పాల్పడిన కేసీఆర్ కూతురు కవిత ఏమయ్యారు...వారి తెలంగాణావాదం ఎక్కడికి పోయింది... అని సినిమా నిర్మాత కొడాలి నాని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:adurhs, ki, break, Political, Entertainment, Telugu
|