బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ (ఎస్‌ఆర్‌కె)కు క్రీడలపై గల అభిమానం ఆయన పిల్లలపై కూడా ప్రభావం చూపినట్లున్నది. 'కింగ్ ఖాన్' కుమారుడు ఆర్యన్ కుమార్తె సుహానా ఆదివారం ముంబైలో తేక్వాండో చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు హస్తగతం చేసుకున్నారు. బాలీవుడ్ 'బాద్షా' షారుఖ్ స్వయంగా ట్విట్టర్‌లో ఈ విషయం వెల్లడించారు. 'ఆహా. నా కుమారుడు కుమార్తె ఇద్దరూ తేక్వాండో చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు' అని షారుఖ్ ఖాన్ తన ట్విట్టర్‌లో తెలిపారు. 'సుహానాకు పట్టుదల ఉన్నది. ఆర్యన్‌కు ప్రావీణ్యం ఉన్నది.
నేను కంగారు మనిషిని' అని షారుఖ్ ఖాన్ పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మూడవ సీజన్ టోర్నీలో పాకిస్థానీ క్రీడాకారులను చేర్చుకోవాలన్న తన వైఖరిపై వివాదంలో చిక్కుకున్న షారుఖ్ తన తాజా చిత్రం 'మై నేమ్ ఈజ్ ఖాన్' ప్రచారం కోసం అమెరికాలో పర్యటించి శనివారం ముంబైకి తిరిగి వచ్చారు. షారుఖ్ సన్నిహిత మిత్రుడు కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. 'దిల్‌వాలే దుల్హనియా లే జాయెంగే' చిత్రం తరువాత పదేళ్ళకు షారుఖ్ సరసన ఈ చిత్రంలో కాజోల్ నటించింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
|