అదుర్స్ సినిమా నిర్మాత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జేఏసీ తీవ్రంగా ఖండించింది. నాని వైఖరిని ప్రాంతీయతత్వమని ఇంకా చెప్పాలంటే మూఢత్వమని జేఏసీ కన్వీనర్ కోదండరామ్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఆయన అభిమానులు సినీపరిశ్రమకు చెందిన కొంతమంది నిర్మాతలు చేసిన విజ్ఞప్తిమేరకు అదుర్స్ సినిమాను తెలంగాణ జిల్లాల్లో ఆదరించామని అన్నారు. ఇంతటి మానవత్వం గౌరవంతో మెలిగిన తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా కొడాలి నాని మాట్లాడటం కేవలం వారి డబ్బు మదమే తప్ప మరొక్కటి కాదని కోదండరామ్ అన్నారు. ఇక తెలంగాణలో అదుర్స్ సినిమానూ పూర్తిగా అడ్డుకోవాలని పిలుపునిస్తున్నట్లు కోదండరామ్ తెలిపారు. ఇవాళ ఎమ్మెల్య క్వార్టర్స్‌లో జరిగిన జేఏసీ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ban, adurs, in, telangana, Political, Entertainment, Telugu
|