రాజ్య సభలో చారిత్రాత్మక ఘట్టానికి మంగళవారం సాక్షిగా నిలిచింది. 14ఏళ్ల సుధీర్గ పోరాటానికి ఫలితం దక్కింది. మహిళా బిల్లు కు రాజ్య సభలో ఆమోదం పొందకుండా చూడటానికి అడుగడుగునా అడ్డు తగిలినా బిల్లు ఆమోదాన్ని మాత్రం ఆపలేక పోయారు. రాజ్య సభలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. సభకు అడ్డు తగులుతున్న ఏడుగురు సభ్యులను చైర్మన్ అన్సారి బైటికి పంపారు. మంగళవారం ౧౮౭ మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. నిజానికి 155 మంది సభ్యులు సభలో ఆమోదం తెలిపితే చాలు బిల్ పాస్ అవుతింది. సభలో కాంగ్రెస్ కు 71 బి. జే. పీ. కి 45 వామపక్షాలకు చెందిన 22 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాక డి. ఎం.కే. మిగిలిన పార్టీలకు చెందిన సభ్యులు కూడా బిల్లుకు ఆమోదం తెలిపారు. మహిళా బిల్లు కు బి.. జే. పి. వామపక్షాలు మొదటి నుంచి మహిళా బిల్లుకు అండగా నిలిచారు. ఇది మహిళలకు ప్రభుత్వం ఇచ్చిన అపురూప కానుక అని చెప్పాలి. ఈ బిల్లు సోమవారం రాజ్య సభలో ఆమోదం పొంది ఉంటె అతర్హతుయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు పట్టాభిషేకం జరిపి ఉన్నట్లు ఉండేది ఒక రోజు ఆలస్యంగా అయినా రాజ్య సభలో మహిళా బిల్లు ఆమోదం పొందడం మహిళల విజయంగా అభివర్ణించవచ్చు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Historical, event, in, Rajya, sabha, , Political, Entertainment, Telugu