ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి మంగళవారం తెలంగాణా సెగ తగిలింది. సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తరువాత మొదటి సారిగా చిరంజీవి మంగళవారం విద్యుత్ కోతను నిరసనగా విద్యుత్ సౌద ఎదుట ధర్నాలో పాల్గొన్న సందర్భంగా తెలం గాణా విద్యుత్ ఉద్యోగులు ఆయనను నిలదిసినంత పని చేశారు. చిరంజీవి సమైక్యవాదానికి మద్దతు ఇవ్వడాన్ని వారు తప్పు పట్టా రు. ధర్నాలో పాల్గొన్న తరువాత విద్యుత్ సౌద లోని ఉన్నతాధికారులకు వినతి పత్రాలు ఇవ్వడానికి లిఫ్టులో పైకి వెళ్లి తిరిగి వస్తుం డ గా కరెంట్ పోవడం తో మద్యలో లిఫ్టు ఆగిపోయింది . చిరంజీవి లిఫ్ట్ లో చిక్కుకొని పోయారు. విద్యుత్ సౌధ సిబ్బంది ఆయనను బయటకు తీసుకొని వచ్చారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు నెక్లెస్ రోడ్డు నుంచి విద్యుత్ సౌధ వరకు ర్యాలీ తలపెట్టారు. ఖైరతాబాద్ చౌరస్తాలో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ప్రయత్నం చేశారు.
v.j .
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)