తెలంగాణా కోసం మరో విద్యార్థి మంగళవారం అత్మబలిదానానికి పాల్పడ్డాడు.సాయి కుమార్ అనే బి. టెక్ విద్యార్ధి ఉరి వేసుకొని ఆత్మహత్య కు యత్నించాడు . అ ది తెలిసి ఒక్క సారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అలజడి మొదలైంది. తోటి విద్యార్థులు అతన్ని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ చికిత్స పొందు తూ అతను మరణించాడు. ప్రస్తుతం ఉస్మానియా విశ్విద్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.సాయి కుమార్ నల్గొండ జిల్లా కోదాడ ప్రాంతానికి చెందిన వాడు కావడం తో అతని బౌతిక కాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్ళి అప్పగించాలని పోలీసులు ఆలోచిస్తున్నారు. విశ్వ విద్యాలయం ప్రాంగణానికి తిసుకేల్లలని విద్యా ర్థులు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష జరపనున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:One, more, student, commits, suicide, over, Telangana, Political, Entertainment, Telugu
|