కర్నూల్ మాజీ మేయర్ భంగి అనంతయ్య మంగళవారం మరో సంచలనం సృష్టించారు. ప్రభుత్వ ప్రజవ్యరేక విధానాలపై తన దైన శైలిలో విచిత్ర వేషదారణల తో ప్రజలను ఆకరిస్తూ వచ్చిన టి. డి. పి. నాయకుడు మంగళవారం ఏకంగా తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుజిల్లా కు చెందిన ముఖ్య నేతలు కే.ఇ.సోదరులు మో హన్ రెడ్డి ఇతర ముఖ్యనేతలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . చంద్రబాబు కే. ఇ . కృష్ణ మూర్తి కే.ఇ. ప్రభాకర్ ఇతరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.పార్టీ కోసం తాను ఎంతో కష్టపడి పనిచేస్తున్నా తనకు తగిన గుర్తింపు దక్కడం లేదనిరాజ్య సభ కు తనను ఎంపిక చేయాలని కోరినా పట్టించు కాలేదనిపార్టీ కోసం తాను తన ఆస్తులు అమ్ముకొని పనిచేసినా పార్టీ నుంచి చిత్కారం దక్కిందని విమర్శించారు. భంగి విచిత్ర వేషధారణలు పార్టీకి తల వంపులు తెస్తున్నాయని పైగా పార్టీ నేతలపై అయన చేసిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:TDP, suspends, kurnool, ex, meyer, from, party, , Political, Entertainment, Telugu
|