మహిళా రిజర్వేషన్ బిల్లు ను లోక్ సభలో ఆమోదింప చేసుకునే విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యు. పి. ఎ. ప్రభుత్వం ఆచి తూచి అడుగు వేస్తోంది. లోక్ సభ లో సాదారణ రైవే బడ్జెట్ ల ఆమోదం పొందేవరకు మహిళా బిల్లు ను ఓటింగ్ కు పెట్టరాదని ప్రభుత్వం అభిప్రాయంగా కనిపిస్తోంది. మంగళవారం రాజ్య సభలో మహిళా బిల్లు ఆమోదం పొందిన కారణంగా వెంటనే లోక్ సభలో కూడా బిల్లు ఆమోదింప చేసుకోవడం మంచిదని మరి కొందరు సూచిస్తున్నారు. మహిళా రిజ ర్వేషన్ బిల్లు ఆమోదానికి రాజ్య సభలో సహకరించిన విధంగానే లోక్ సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమైన బి.జే. పి. వామపక్షాలుఇతర పార్టీల నుంచి సంపూర్ణ సహకారం లబిస్తుందని యు. పి. ఎ. ప్రభుత్వం బావిస్తున్నా తిర బిల్లును ప్రవేశ పెట్టిన తరువాత ఏదైనా జరిగి బిల్లు విగి పోయే పరిస్థితి ఎదురైత ప్రభుత్వ మనుగడ ప్రశ్నర్థం అవుతుందన్న భయం కాంగ్రెస్ కు ఉంది. ముందుగ రైల్వే సాదారణ బడ్జెట్ లకు సభ ఆమోదం పొందిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆలో చించాలని బావిస్తోంది. యాదవ్ త్రయం తో పాటు మరి కొన్ని పార్టిలు బిల్లును లోక్ సభలో వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు. 544 మంది సభ్యులు ఉన్న లోక్ సభ లో మహిళా బిల్లు ఆమోదం పొందాలంటే 366 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేసి ఆమోదం తెలపాల్సి ఉంది. వెంటనే ఆమోదం పొందా ల్సిన రెండుముఖ్యమైన బిల్లులు సభ ముందు ఉన్నాయి. వాటికీ ఆమోదం లభించే వరకు ఎ మాత్రం తొందర పడరాదనిసంయమనంతో వ్యవహరించాలని ప్రభు త్వం అభిప్రాయ పడుతోంది. ఒక వరం తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడం అన్ని రకాల మంచిదని బావిస్తోంది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Govt,to,bring,Women,Reservation,Bill,in,Parliament,next,week,, Political, Entertainment, Telugu
|