అసెంబ్లీ బుధవారం 15 నిముషాలు వాయిదా పడింది. బ్రాహ్మిణి స్టిల్స్ పై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వాది వేడిగా చర్చ జరిగింది. అధికార విపక్షాల మద్య వాద ప్రతివాదాలు ఆరోపణలు ప్రత్యారోపణ లతో సభ దద్దరిల్లింది. మైనింగ్ మాఫియాను అధికారపక్షం ప్రోత్సహిస్తోందని ప్రధాన ప్రతి పక్ష నేత చంద్రబాబు తీవ్రంగా విమరించారు. దానికి పరిశ్రమ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా స్పందించారు. సత్తా ఉంటె చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. దాంతో సభలో వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని గమనించిన స్పీకర్ సభను 15 నిముషాలు వాయిదా వేశారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Assembly, adjourned, for, 15, minutes, , Political, Entertainment, Telugu
|