మిత్ర పక్షాలను బుజ్జగించే పనిలో యు. పి. ఎ. తలమునకలు అవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో తమ అభ్యంతరాలను పట్టించుకోనందుకు యుపిఏ కు మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరించుకునే విషయంలో సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం మాత్రం స్పష్టమైన వైఖరి చెప్పడం లేదు. రాజ్య సభలో బిల్లును ఆమోదింప జేసుకోవడం లో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడానికి నిరసనగా రాజ్యసభలో ఓటింగ్‌కు గైరుహాజరయిన యుపిఏ భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి రైల్వే మంత్రి మమతా బెనర్జీ మాత్రం ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మిత్రపక్షాలను విశ్వసించకుండా తమకు విదోదులైన వామపక్షాలను విశ్వసించడంపై మమత అసంతృప్తి తో ఇన్నారు. ఇవన్ని గమనించిన యు. పి. ఎ. మిత్ర పక్షాలను ఎలా బుజ్జగించాలో అని ఆలోచిస్తోంది. లోక్ సభలో రెండు ముఖ్యమిన బిల్లు లను ఆమోదింప చేసు కోవడం ఇపుడు చాల ముఖ్యమని మిత్రపక్షాలకు సర్ది చెప్పి ఆ బిల్లుల ఆమోదం పొందడానికి సహకారాన్ని పొందడానికి అన్ని రకాల ప్రయత్నాలను మొద లు పెట్టింది. అయితే అర్. జే. డి. సమాజ్ వాది పార్టీలు ప్రభుత్వానికి ఎ మాత్రం సహకరించే అవకాశాలు కనిపించడం లేదు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:UPA,trying,to,pacify,difference,in,its,friendly,parties,, Political, Entertainment, Telugu
|