మహిళా బిల్లు ఆమోదం పొందడం పట్ల ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు కె.చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మకమైన రోజన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ బిల్లు లోక్‌సభలో కూడా ఆమోదం పొందుతుందన్న విశ్వాసాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తారని తద్వారా మహిళా సాధికారిత సాకారమవుతుందన్నారు. ఈ బిల్లు చట్టంగా రూపొందాక తగిన సవరణలు చేసి బీసీ మైనారిటీ అట్టడుగు వర్గాల మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:chiru,comments,on,womens,bill, Political, Entertainment, Telugu
|