రాష్ట్రంలో ఏయే సీట్లు మహిళలకు వెళతాయి? కేటాయింపులో అనుసరించే అవకాశమున్న ప్రాతిపదికలేమిటి? అనే దానిపై చర్చ ప్రారంభమైంది. రాబోయే చట్ట ప్రకారం.. 2014 సార్వత్రిక ఎన్నికలతో మన రాష్ట్రంలో ఈ మహిళా రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. 42 లోక్‌సభ స్థానాల్లో 14.. 294 అసెంబ్లీ స్థానాల్లో 98 మహిళలకు రిజర్వ్ అవుతాయి.మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో మన రాష్ట్రంలో ఏయే లోక్‌సభ శాసనసభ స్థానాలు మహిళలకు వెళతాయనే దానిపై అప్పుడే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో 14 లోక్‌సభ స్థానాలు మహిళలకు కేటాయించాలి. వాటిని ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో తెలియనప్పటికీ 2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే... శ్రీకాకుళం (కిల్లి కృపారాణి - కాంగ్రెస్) విజయనగరం (బొత్స ఝాన్సీ- కాంగ్రెస్)ల నుంచి ప్రస్తుతం మహిళలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మిగిలిన వాటిలో నిజామాబాద్‌లో మధుయాష్కీ అరకులో కిషోర్‌చంద్రదేవ్ అనకాపల్లిలో సబ్బం హరి కరీంనగర్‌లో పొన్నం ప్రభాకర్ నర్సాపురంలో కె.బాపిరాజు అమలాపురంలో హర్షకుమార్ ఏలూరులో కెఎస్‌రావు రాజమండ్రిలో అరుణ్‌కుమార్ నెల్లూరులో రాజమోహన్‌రెడ్డి తిరుపతిలో చింతా మోహన్ జహీరాబాద్‌లో సురేష్‌షెట్కార్(అంతా కాంగ్రెస్) మచిలీపట్నంలో కె.నారాయణ(టీడీపీ)ల స్థానాలు గల్లంతు కావచ్చు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:womens,reservation,bill,effect,on,andhra, Political, Entertainment, Telugu
|