నిత్యానంద స్వామి రసలిలలకు సంబందించిన వివరాలు ఒకొక్కటి బయటి కి వస్తున్నాయి. తన ప్రాణాలకు నిత్యానంద శిష్యులు అనుచరుల నుంచి ముప్పు ఉందని చెన్నై పోలీసులకు మొరపెట్టుకొని తనవద్ద ఉన్న విడియోలను వారికీ అప్పగించిన నిత్యానంద స్వామి డ్రైవర్ లెనిన్ తరువాత పోలీసులకు కనిపించడం లేదు అతను ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. ఇక ఆరోపణలు ఎదుర్కొం టున్న రంజితనిత్యానందస్వామిలకోసం పోలీసులు గాలిస్తున్నారు.నిత్యానంద ప్రవచనాలు ముద్రించే కేరళకు చెందినా ఒక మ్యాగ జిన్ కి రంజిత ఇచ్చిన ఇంటర్వ్యు ప్రచురితం కావడం తో అక్కడికి ఒక పోలీస్ బృందం వెళ్లి నట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్వామి నిత్యానంద రంజిత తో సాగించిన రసలిలలను ఎప్పుడు చిత్రీకరించింది లెనిన్ తాజాగా బైట పెట్టాడు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి 25 తేదీ వరకు వాటిని చిత్రీకరించినట్లు లెనిన్ చెబుతున్నాడు.విదేశాల నుంచి తెప్పించిన ప్రతేక కేమెర తో వాటిని చిత్రీక రించినట్లు విడియోలో ఇన్న రెండవ మహిళా ఆశ్రమంలో పని చేసే మహిళా కార్యదర్శి గోపిక అని కూడా పేర్కొన్నాడు. గుజరాత్ ముఖ్యమంత్రి మోడి స్వామి పాదాలకు నమస్కరించినట్లు పేర్కొంటున్నాడు.
ఇందంతా సరే స్వామి నిత్యానంద వద్ద డ్రైవర్ గా పని చేసిన లెనిన్ స్వామి నిత్యానంద రాస లీలా లను చిత్రీకరించడానికి కారణాలు ఏమిటి? నాలుగు నెలల కిందట చిత్రీకరించిన వీడియోను ఇపుడు ఎందుకు బైట పెట్టాడు? ఈ మద్యలో ఎం జరిగింది?.ఒక డ్రైవర్ కు విదేశాలనుంచి విడియో కెమెరా తెప్పించుకునే అంత ఆర్థిక స్తోమత ఉంటుందా? ఏదో ప్రయోజనాన్ని ఆశించి తీసిన వీడియో ను ఆది నెరవేరక పోవడం తో లీక్ చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏమైనా ఒక స్వామి బాగోతం మాత్రం బైట పడింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)