సినిమా దర్శకుడు తేజ ను ఈ నెల 17 వ తేదీ లోగా తమ ఎదుట హాజరుపరచాలని రాష్ట్ర మనవ హక్కుల కమిషన్ (ఎస్. హెచ్ ఆర్. సి) చైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి బంజారాహిల్స్ ఎ.సి. పి. ను ఆదేశించారు. దర్శకుడు తేజ తన పై దాడికి దిగినట్లు నిర్మాత చదలవాడ ఎస్. హెచ్. ఆర్. సి.కి కలిసి ఫిర్యాదు చేశారు.దానిపై స్పందించిన కమిషన్ తేజను అయన తో పాటు అయన మామ పద్మనాభ రెడ్డిని కూడా తమ ఎదుట హాజరు పరచాలని ఆదేశించింది. దర్శకుడు తేజ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మద్య ఇంటి వివాదం ఉంది. ఈ ఇంటి వివాదం రో జు రోజు కు ముదురు తోంది. తన ఇంటిని కారు చవకగా కొట్టేయడానికి నిర్మాత చదలవాడ ప్రయత్నం చేస్తున్నారని తేజ వాదన. తనకు ఇంటిని అమ్మిన తేజ దాన్ని ఖాలీ చేయడం లేదని చదలవాడ కూడా తన వాదన విన్పిస్తున్నారు.బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తేజ పై చీటింగ్ కేసు కూడా నమోదు అయింది. కాకపోతే ఇంటి వివాదం సివిల్ వివాదం కావడం తో పోలీసులు జోక్యం చేసుకోలేదు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:S, H, R, C, directs, ACP, to, produce, Director, Teja, before, 17th, of, this, month, , Political, Entertainment, Telugu
|