తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ వైఖరిలో ఎ మాత్రం మార్పు వచ్చినట్లు లేదు. మహిళా రిజర్వేషన్ బిల్ ను రాజ్య సభలో ఆమోదింప జేసుకునే ముందు మిత్రపక్షమైన తనను సంప్రదించక పోవడం పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఆగ్రహంతో ఆమె కుత కుత లాడారు. లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టె ముందు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వించాలని డిమాండ్ చేశారు. రాజ్య సభలో ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ వారు ఓటింగ్ లో పాల్గొనకుండా చూశారు. తన సత్తా ఏమిటో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయం లో తన వైఖరిని వ్యక్తం చేస్తా అని గట్టి గానే చెప్పారు. మహిళా బిల్లు కు తమ పార్టీ గాని తాను గాని వ్యతిరేకం కాదని అంటూనే మహిళా రిజర్వేషన్లలో మైనార్టీలకు కోటా ఇవ్వాలన్న డిమాండ్‌పై ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారని తాము వేచిచూశామని అయితే తర్వాత తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. మరి లోక్ సభలో మమత బిల్లును సమర్దిస్తారో లేదో తెలుసుకోవాలంటే మరో కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:No, change, in, Mamata, Banerjees, stand, Political, Entertainment, Telugu
|