'ఇంట్లో నేనే వంట చేస్తా. వంట చేసి అసెంబ్లీకి వస్తా' అని మంత్రి గల్లా అరుణకుమారితో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చెప్పారు. శాసనసభా లాబీల్లో బుధవారం వారిరువురూ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్ధరి మధ్య మహిళా రిజర్వేషన్‌పై చర్చ జరిగింది. 'ఇంతకాలం మహిళలం వంట చేస్తూ ఎన్నికల్లో విజయం సాధించి .. శాసనసభా సమావేశాలకు వస్తున్నాం. ఇక భవిష్యత్‌లో మీరే వంట చేయాలి' అని రేవంత్‌తో గల్లా అరుణకుమారి అన్నారు.
' ఇప్పుడు నేనే ఇంట్లో వంట చేస్తున్నాను. వంట చేసి అసెంబ్లీకి వస్తాను' అని రేవంత్ అన్నారు. ' ఇంట్లో వాళ్లు ఇక్కడ లేరేమో' అని గల్లా అరుణ కుమారి అన్నారు. ' ఇంట్లో అందరూ ఉన్నా నేనే చేస్తా' అని చెప్పారు. దీంతో వెరీగుడ్ అంటూ రేవంత్‌కు అరుణకుమారి షేక్‌హ్యాండ్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును రానివ్వకుండా కోటాలంటూ అడ్డం పడుతున్నారని అరుణ కుమారి అన్నారు. ఈ సమయంలో .. మహిళా రిజర్వేషన్‌ను ఎవరూ అడ్డుకోవడం లేదని.. అయితే.. రోటేషన్ విధానం మాత్రం మంచిది కాదని.. దీనిని అడ్డుకోవాలని రేవంత్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో అరుణకుమారి ఏకీభవించారు. రోటేషన్ పద్దతిన మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడం కంటే .. ఇవ్వకుండా ఉండడమే మంచిదని ఆమె అన్నారు. తాను రొటేషన్ పద్దతిని వ్యతిరేకిస్తానని అన్నారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:revanth, reddy, galla, aruna, kumari, Political, Entertainment, Telugu
|