మహిళా రిజర్వేషన్ బిల్లు ను లోక్ సభ లో ఆమోదింప జేసుకోవడం లో కూడా యు. పి. ఏ. కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరింత ధీమా గా ఉంది. మహిళా బిల్లు ను లోక్ సభలో ఎప్పుడు ప్రవేశ పెట్టాలి అన్న అంశం గురించి చర్చించడానికి శుక్రవారం బి. ఎ.సి సమావేశంలో చచించి ఖరారు చేయనుంది. ఆర్థిక ఇతర కీలక బిల్లులు ఆమోదం పొందిన తరువాతనే మహిళా రిజర్వేషన్ బిల్లు ను లోక్ సభలో ప్రవేశ పెట్ట వచ్చు. బహుశ బిల్లును ఈ నెల 16 వ తేదీలోగా ఎప్పుడైనా పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్న రోజున బిల్లును సభలో ప్రవేశపెట్ట వచ్చు. బిల్లు ఆమోదం పొందే వరకు కూడా ప్రభుత్వానికి మద్దత్తు ఇస్తామని అండగా ఉంటామని బి. జే. పి. వామపక్షాలు పదే పదే ప్రకటిస్తున్నాయి.మహిళా బిల్లు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన సమాజ్ వాది ఆర్. జే. డి పార్టిలు కాస్త మెత్త పడ్డాయి. ప్రభుత్వానికి మద్దత్తు ఉపసంహరిస్తామని అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని చిందులు వేసిన లాలు ఇపుడు వెనుకంజ వేశారు. సోని యా గాంధీ తో సమావేశం తరువాత మమత బెనర్జీ కూడా కాస్త మెత్త పడినట్లు కనిపిస్తున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Government,is,very,confident,on,womens,bill,in,Lok,sabha,, Political, Entertainment, Telugu
|