మహిళా రిజర్వేషన్ బిల్లు కు తాము వ్యతిరేకం కాదని ఉప బిల్లు కోసం తాము పట్టు పడుతున్నట్లు లాలీ. ములాయం లు చెబు తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు వారు అడ్డు పదే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పుడైతే వామపక్షాలు బి. జే. పి కేంద్రానికి అండ గా నిలిచాయో ఇక తాము అడ్డు తగిలినా ఎలాంటి ప్రయో జనం ఉండదన్న విషయాన్ని గ్రహించి వారు కాస్త వెనక్కు తగ్గా ల్సి వచ్చింది. 31వతేదీలోగా ఆర్థిక బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలపాల్సి ఉం టుంది. తమకు సంఖ్యాబలం లేని కారణంగా ప్రభు త్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచన చేయడం లేదని ఎస్పీ ఆర్జేడీ అధినేతలు ములాయం సింగ్ యాదవ్ లాలు ప్రసా ద్ వేర్వే రుగా స్పష్టం చేశారు. సమాజ్‌వాది పార్లమెంటరీ పార్టీ బుధవారం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించే విషయంలో కూడా ఆ పార్టీలు తోదరపడటం లేదని అనిపిస్తోంది.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారి సహకారం తీసుకోవడానికి మాత్రమే ఆ రెం డు పార్టీలు పరిమితం కావచ్చు . మహిళా బిల్లుపై తాము ఉద్యమించి తీరుతామని సమాజ్‌వాది స్పష్టం చేస్తోంది. బిల్లులో సబ్ కోటా కోసం అన్ని పార్టీలలోని ము స్లిం ఎంపీలు పట్టుబట్టాలని సమాజ్ వాది పార్టీ పిలుపునిచ్చింది.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)