మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టినట్టు అవుతుంది. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తరువాత మహిళా రిజర్వేషన్ కోట అమలు పై ఒక కమిటి ని నియమించి చర్చించి రిజ ర్వేషన్ గురించి నిర్ణయించాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే ఎంతమంది సీట్లకు ఎసరు వస్తుంది అన్న దానిపై పార్టీలు అప్పుడే లెక్కలు వేసు కుంటున్నాయి. రాష్ట్రం సమైకంగా ఉంటె మహిళా రిజర్వేషన్ కోట కింద ఎమ్మెల్యే ఎం. పి. ల సీట్ల సంఖ్యా తగ్గు తుంది. అదే తెలంగాణా ఏర్పాటు అయితే మాత్రం ఈ సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజ ర్వేషన్ అమలులోకి వస్తే మొదట పోయే ది తన సిటే అని రేవంత్ రెడ్డి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో ఇప్పటి నుంచే ఈ యువ నాయకుడు పార్లమెంట్ కు పోటి చేయడానికి మానసికంగా సిద్దం అవుతున్నాడు. ౨౦౧౪ లో తను ఎం. పి. స్థానానికి పోటీ చేయనున్నట్లు అప్పుడే అయన ప్రచారం చేసుకుంటున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)