ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతి రోజు ఒక అంశం పై నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించిన తెలుగు దేశం లెఫ్ట్ పార్టీలు దాన్ని ఆచరిస్తూ వస్తున్నాయి. గురువారం కూడా తెలుగుదేశం వామపక్ష పార్టీలు చేనేత కార్మికుల సమస్యల పై గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు పాద యా త్ర ను నిర్వహించాయి..చేనేత మగ్గాలు ఇతర సామాగ్రి తో వినూత్న రీతిలో నిరసన తెలిపి ధర్నా లో పాల్గొన్నాయి. చేనేత కార్మికుల రుణాలను మఫి చేయాలనీ డిమాండ్ చేశాయి. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఆందోళనలు ఉద్య మా లు కొనసాగిస్తామని ఆ పార్టిలు ప్రకటించాయి. సమస్యలపై ఈ రెండు పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:TDP, LEFT, parties, dharna, in, Gan, Park, Political, Entertainment, Telugu