రాసలీలలు సాగించిన స్వామి నిత్యానంద ఎక్కడ ఉన్నారు? రాసలీలల వ్యవహారం బైట పది తొమ్మిది రోజులైనా అయన బైటికి ఎందుకు రావడం లేదు? అసలు అయన దేశం లో ఉన్నారా లేదంటే దేశం వదిలి వెళ్లి పోయారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. అయన పై పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్వామి నిత్యానంద దేశంలోనే ఉన్నారని వారణాసి లో జరుగుతున్న కుంభ మేలలో పాల్గొనడానికి వెళ్ళారని అయన న్యాయవాదులు చెబుతున్నారు .అయన మలే సియ లో ఉంటున్నారన్న వాదన ఒకటి వినిపిస్తోంది. కుంభ మేళ తరువాత ఈ నెల 18 వ తేదీన స్వామి నిత్యానంద వస్తారని అయన న్యాయవాదులు అంటున్నారు. నిత్యానంద పై తమిళనాడు కర్ణాటక పోలీసులు పలుసెక్షన్లకిందకేసులు నమోదు చేసి అయన కోసం అరా తీస్తున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)