రాష్ట్రంలో హైరాబాద్ మాత్రమే ఇప్పటిదాకా ఐ హబ్ గా కొనసాగుతూ వచ్చింది. హైటెక్ సిటి స్థాయికి హైదరాబాద్ ఎదగడంలో ఐ. టి. పరిశ్రమ చాల కిలక పాత్ర పో షించింది. గ్లోబల్ ఐ. టి. చిత్ర పటంలో హైదరాబాద్ కు ఎంతో విశిష్టస్థానం దక్కింది. అయితే ఇటివల రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐ. టి. పరిశ్రమ విస్తరణ కొత్త కంపెనీల స్థాపనల విషయంలో సందిగ్దత నెలకొంది. హైరదరాబాద్ లో నెలకొన్న అనిశ్చితి కారణంగా చాల ఐ.టి. సంస్థలు ఇపుడు తమ దృష్టిని సాగర తీర నగరమైన విశాఖ పై దృష్టి పెట్టాయి. విశాఖ లో తమ కంపెనీలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయి. సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాంతో హైదరాబాద్ లో ఉద్యోగావకాశాలు తగ్గిపోనున్నాయి. ఐ. బి. ఎం. సంస్థ విశాఖలో తన శాఖను ఏర్పాటు చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్ప టికే హెచ్. ఎస్. బి. సి. మరి కొన్ని సంస్థలు విశాఖలో తమ శాఖలను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ కు సమాంతరంగా విశాఖ ను అభివృద్ధి చేయడానికి ప్రయ త్నాలు మొదలయినట్లు సర్వేలు చెబుతున్నాయి. విశాఖలో ఐ. టి. సంస్థలు వస్తే దాదాపు పాతిక వేల ఉద్యోగాలు రానున్నాయి. హైదరాబాద్ లో తమ శాఖ లను ఏర్పాటు ఏర్పాటు చేయాలని గతంలో బావించిన పలు కంపెనీలు ఇపుడు ఆ ఆలోచన ను విరమించుకున్నాయి. మరి కొన్ని కంపెనీలు హైదరాబాద్ కు బదులు ఇతర రాష్ట్రాలను ఎంచుకుంటున్నాయి. బెంగళూరు పూణే ప్రాంతాల వైపు చూపు సారిస్తున్నాయి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:IT,companies,eyes,are,now,in,Vizag,, Political, Entertainment, Telugu
|