రాయల సీమ నేతల వైఖరిలో చాల మార్పు వస్తోంది. మొన్నటి దాక సమైక్యాంద్ర కోసం ఉద్యమించిన రాయలసీమ కాంగ్రెస్ నేతలు ఇపుడు సమైక్యాంద్ర వాద నకు మంగళం పాడారు. హైదరాబాద్ లో బుధవారం సెంట్రల్ కోర్ట్ లో జరిగిన రాయల సీమ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రనిధులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిదులు మాత్రం హాజరు కాలేదు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలుశ్రీ కృష్ణ కమిటీకి సమర్పించాల్సిన నివేదిక పై జరిగిన చర్చలో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఉంటె సమైక్యంగా ఉండాలి లేదంటే రాయలసీమ ను తెలంగాణాలో చేర్చాలి అన్న కొత్త వాదనను మాజీ మంత్రి జే. సి. దివాకర్ రెడ్డి తెరపైకి తీసుకోని వచ్చారు. ప్రత్యేక రాయలసీమను కోరుతున్న నేతల వైఖరిలో మార్పునకు కారణం ఏమంటే నది జలాలు అని చెప్పాలి.
ప్రత్యేక తెలంగాణా అంటూ ఏర్పడితే తెలంగాణా ప్రాంతం నుంచి చుక్క నీరు కూడా రాయలసీమకు వచ్చే అవకాశం లేకపోవడమే రాయలసీమ నేతల ఆలోచన మారడానికి కారణం అని చెప్పాలి. అందుకే ఒక వేల తెలంగాణా ఏర్పాటు అనివార్యం అయితే రాయలసీమను తెలంగాణా లో చేర్చాలన్న వాదన ఇపుడు తెరపైకి వచ్చింది. రాయలసీమ ప్రాంతం ప్రధానంగా తుంగ భద్ర ప్రాజెక్ట్ పై ఆధారపడింది . కర్ణాటక ప్రాంతంలో ఉన్న తుంగ భద్ర ప్రాజెక్ట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన న్యా య మైన నీటి వాట ఎన్నడు రాష్ట్రానికి అందడం లేదు. తుంగ భద్ర ను నమ్ముకోవడం కన్నా తెలంగాణాను నమ్ముకోవడమే మేలని రాయలసీమ నేతల అభి ప్రాయంగా ఉంది. మహారాష్ట్ర నుంచి వచ్చే కృష్ణ గోదావరి నది జలాలు మొదట తెలంగాణా ప్రాంతాన్ని సృశించి కానీ రాయలసీమలో అడుగు పెట్టావు. ఈ దృష్ట్యా రాయలసీమ ప్రాంతం తెలంగాణాలో చేరితే కనీసం ఏట సక్రమంగా సాగు నీరు అందుతుందన్న బావన రాయల సీమ కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరో సారి ఏర్పాటు చేసే సమావేశంలో నెల్లూరు ప్రకాశం జిల్లాల నేతలను కూడా ఆహ్వానించి వారిని కూడా తమతో కలవాలని కోరనున్నారు.
రాష్ట్రం అంటూ విడిపోతే తమ జిల్లాను కర్ణాటకలో విలీనం చేయాలని గతంలో వాదించిన మాజీ మంత్రి అనంత పురం జిల్లా నేత జే. సి. దివాకర్ రెడ్డి ఇపుడు తెలంగాణాలో రాయలసీమను చేర్చాలని వాదిస్తున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)