ముఖ్యమంత్రి రోశయ్య క్రమంగా బలపడుతున్నారు. ఆరు నెలల ముఖ్యమంత్రి పదవి కాలాన్ని పూర్తి చేసుకున్న రోశయ్య కు మొదటి మూడు నెలల్లో సొంత పార్టీ కి చెందిన వారి నుంచే కాక మంత్రి వర్గ సహచరుల నుంచి సహాయనిరాకరణ ఎదురైంది.. తగిన సమయం కోసం ఓపికగా నిరీక్షించిన రోశయ్య ఇపుడు త నను ఇబ్బంది పెటిన వారిని వార్నింగ్ లు ఇచ్చే స్థాయికి చేరారు. వ్యతిరేకులకు చెక్ పెడు తున్నారు. జగన్ వర్గానికి చెందిన వీర విధేయులైన అనం సోదరులకు రోశయ్య తనదైన శైలిలో షాక్ ఇచ్చారు. మొన్నకు మొన్న నెల్లూరు మహిళా మేయర్ భానుశ్రీ భర్త ఎలక్ట్రికల్ ఉన్నతాధికారి సుబ్బరాజు ఇంటి పై ఎ. సి . బి దాడి వెనుక రోశయ్య ప్రోత్సాహం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెసిసింది. అనం సోదరుల ఆశీస్సులతో మేయర్ పదవిని ఏడు నెలల కిందట ఆమె చేపట్టారు. ఆ మె భర్త పై ఎ. సి. బి నిర్వహించిన దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి ఆయనను అరెస్ట్ చేశారు. ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి ప్రనేయం ఉందన్న వార్తలు వినిపి స్తున్నా యి. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం కోసం రోశయ్యను వ్యతిరేకించిన అనం సోదరులు ఆయనను ఎ మాత్రం లెక్క చేయలేదు. తన సత్తా ఏమిటో చూపడా నికి రోశయ్య ఇచ్చిన ఝలక్ తో ఇపుడు నేతల వైఖరిలో మార్పు వస్తోంది. ఈ ఒక్క సంఘటన చాలు రోశయ్య బలపడినట్లు చెప్ప డా నికి . అరునెలలు ముఖ్య మంత్రి పదవి నేర్పిన పాఠాలు రోశయ్యలో చాల మార్పుని తీసుకొచ్చింది. కరుకుగా వ్యవహరించడం మాటవినని వారిని తప్పించడానికి వెనుకాడని సాహసం వెనుక అధిష్టానం అండ రోశయ్యకు ఉండటమే కారణం అని చెప్పాలి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)