రాష్ట్ర ప్రభుత్వం 2008 వ సంవత్సరానికి గాను జాతీయ చలన చిత్ర అవార్డ్ లను గురువారం ప్రకటించింది. ఒక నాటి అందాల తార తన అభినయం తో అందరిని ఆకట్టుకొని మూడు దశాబ్దాలకు పైగానే చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హిరోయిన్ లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగిన శ్రీమతి జమున కు 2008 వ సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎన్. టి. ఆర్. జాతీయ చలన చిత్ర అవార్డ్ ను అందివ్వనుంది. ప్రముఖ మహిళా దర్శకురాలు నటి విజయనిర్మలకు రఘుపతి వెం క య్య అవార్డ్ ను ప్రముఖ దర్శకుడు కే.బి తిలక్ కు బి.ఎస్. రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డ్ ను అందివ్వనుంది. లలిత కళా తోరణంలో ఈ నెల 16 వ తేదీన జరగ నున్న ఒక కార్యక్రమంలో ప్రభుత్వం ఈ అవర్డ్లను ప్రధానం చేయనుంది. ముఖ్యమంత్రి రోశయ్య అవర్డ్లను ప్రధానం చేస్తారు. చిత్ర పరి శ్రమ కు చెందిన పలువురు ప్రముఖు లతో పాటు పలువురు మంత్రులు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:NTR, National, Film, Award, to, Jamuna, Political, Entertainment, Telugu