మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో చర్చకు పెట్టె ముందు అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడానికి యు. పి. ఎ. నిర్ణ యించింది. అన్ని పార్టీల సహకారం తోనే లోక్ సభలో బిల్లును ఆమోదింప జేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తాజాగా నిర్ణయించు కుంది.మహిళా రిజర్వేషన్ బిల్లు విషయానికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష బి. జే. పి. లో బిన్న భిప్రాయాలు వ్యక్తం కావడం కొం దరు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడానికి కూడా వేకదరదన్న అభిప్రాయాలూ వినిపిస్తుండటం తో యు. పి. ఎ. సర్కార్ కూడా పునరాలోచనలో పడింది. విపక్షాల వ్యతిరేకతను పట్టించు కోకుండా మొండిగా వ్యవహరించడం వల్ల మరింత ఇబ్బందులు ఇక్క ట్లు ఎదుర్కో వ డం కన్నా అన్ని పార్టీలతో సమావేశాన్ని నిర్వహించి వారి మద్దత్తు కూడా గత్తడమే మంచిదని కేంద్రం బావిస్తోంది.
మహిళా బిల్లు విషయంలో యాదవ్ త్రయం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చేసిన ప్రకటన తో లలుయదావ్ ములాయం సింగ్ యాదవ్ శరద్ యాదవ్ ల పంతం నెగ్గిందనే చెప్పాలి . మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల ముస్లిం మైనార్టీ లకు దళితులకు అన్యాయం జరుగుతుందని యా దవ్ త్రయం మొదటి నుంచి వాదిస్తోంది. తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని అయితే ఉప కోట విషయం తేల్చాలని వారు అంటున్నారు. తమ అభ్యంత రా లు అభిప్రాయాలూ పరిగణనలోకి తీసుకోకపోతే ప్రభుత్వానికి మద్దత్తు ను ఉపసంహరించు కుంట మని కూడా హెచ్చరించడం తో ప్రభుత్వం కూడా కూడా వెనక్కు తగ్గక తప్పలేదు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Centre, ready, for, all, party, meet, to, discuss, Womens, Reservation, , Political, Entertainment, Telugu