మహిళా రిజర్వేషన్ బిల్లు భారతీయ జనత పార్టీలో చిచ్చు రేపుతోంది. మహిళా రిజర్వేషన్ వల్ల పురుషుల సీట్ల శాతం తగ్గి పో తుందని బి. జే. పి. కి చెందిన కొం దరు ఇపుడు కొత్త వాదన ఒకటి లేవ దిశారు. రాజ్య సభలో మహిళా బిల్లుకు అనుకూ లంగా ఓటింగ్లోపాల్గొన్న బి. జే. పి లోక్ సభ లో బిల్లు కు ఆమోదం తెలిపే విషయంలో పార్టీలోని కొందరు సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు అభ్యంతరాలతో బి జే. పి. నాయకత్వం ఇరకాటంలో పడింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాన ప్రతి పక్షమైన బి. జే. పి. అండగా నిలవడం తో కేంద్రంలో అధికారంలో ఉన్న యు. పి. ఎ. ప్రభుత్వం బిల్లు కు అ పార్టి నుంచి సం పూర్ణ సహకారం మద్దత్తు లభిస్తుందన్న ధీమా తో ఉంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో 116 మంది సభ్యులు కలిగిన బి. జే. పి. మద్దత్తు యు. పి. ఎ. సర్కార్ కు చాల కీలకం కానుంది. తను ఇచ్చిన మాట నిలుపుకోవడానికి మరో సారి విప్ జారీచేయడం మినహా మరో మార్గం లేదని బి. జే. పి. బావిస్తోంది.
చట్ట సభల్లో మూడో వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయడానికి ప్రతిపాదించిన 108 వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందితే పురుషుల సీట్లు తగ్గి పోతుందని ఆ కారణంగా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కొందరు బి. జే. పి. సభ్యులు బావిస్తున్నారు. దాంతో తమ పార్టీ సభ్యులను బుజ్జగించ డా నికి బి. జే. పి. నాయకత్వం నడుం బిగించింది. వారికీ నచ్చే చెప్పడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అది ఎ మేరకు ఫలిస్తుందో చూడాలి.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)