రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థి కరణ జరగ వచ్చు అన్న ఉహాగానాలు మళ్లి ఉపందు కున్నాయి. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగవచ్చు అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావహులు ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. వై. ఎస్. వ్యతిరేక వర్గానికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని జగన్ వర్గీ యుల్లో కొందరికి ఉద్వాసన తప్పక పోవచ్చునని వినికిడి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత మంత్రి వర్గ పునర్ వ్యవస్థి కరణ జర గడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ నాలుగో తేదీన మంత్రి వర్గం విస్తరణ ఉండవచ్చు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆరు నెలలు పూర్తి చేసుకున్న రోశయ్య ఇపుడు పరి పాలనపై పట్టు సాదించడమే కాదు మంత్రి వర్గ సహచరులను కూడా దారిలో పెట్టారు.
మొదటి మూడు నెలలు ముఖ్యమంత్రి రోశయ్య అన్ని రకాల సమస్య ల ను ఎదుర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వై. ఎస్. వర్గీయుల నుంచి వచ్చిన వ్యతిరేకత మంత్రి వర్గంలోని వై. ఎస్. వర్గానికి చెందిన కొందరు మంత్రులు బాహాటం గానే ముఖ్యమంత్రిని వ్యతిరేకించడం సహాయనిరాకరణ లాంటి వాటిని అయన చాల సహనం తో సహించారు. భరించారు.పరిస్థితి తనకు అనుకూలంగా మలుచు కున్న తరువాత తన సత్తా ఏమిటో చూపడం మొదలు పెట్టారు. అధిష్టాన వర్గం కూడా రోశయ్యకు బాసట నిలిచింది.జగన్ ను ముఖ్య మంత్రి పీఠం పై కూర్చో పెట్టడమే తమ కర్తవ్యం అన్నట్లు వ్యవహరించిన ఒక రిద్దరు మంత్రులు కూడా తమ ఆట లు సాగవని తెలుసుకొని మిన్నకుండి పోయారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం ఇప్పట్లో కుదరదని అధిష్టానవర్గం తేల్చి చెప్పడం తో జగన్ వర్గీయులు వెనక్కు తగ్గారు. తెలంగాణా ఉద్యమం తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి చేసిన ప్రయత్నం కూడా శ్రీ కృష్ణ కమిటీ పుణ్యమా అని చల్ల పడింది.
ప్రస్తుతం పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండటం తో ముఖ్యమంత్రి మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు కొందరికి ఉద్వాసన మరికొందరిని మంత్రి వర్గంలో చేర్చుకోవడం పై దృష్టి పెట్టారు. అధిష్టాన వర్గం నుంచి అయన గ్రీన్ సిగ్నల్ పొందారని వినికిడి. జే. సి. దివాకర్ రెడ్డి జానా రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి లకు మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి స్పీకర్ గా నియమితులు కావచ్చు . కీలక సమయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిలో కొందరి పై అయన వేటు వేసినా ఆశ్చర్యపోనక్కరలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ను జగన్ గెలిపిస్తాడని అధికారంలోకి తెస్తాడని అనం వివేక చేసిన వ్యాఖ్యలకు పర్యవసానంగా అయన వర్గానికి చెందిననెల్లూరు మేయర్ ఇంటిపై ఏసీబీ దాడులు జరగడాన్ని ఇక్కడ గుర్తించక తప్పదు.రోశయ్య వ్యహారం ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలంటే ఏప్రిల్ నాలుగో తేదీ దాక వేచి చూడక తప్పదు.
v.j
.