తెలంగాణా పై బి. జే. పి. రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్లును శుక్రవారం ప్రవేశ పెట్టనుంది బి. జే. పి. రాజ్య సభ సభ్యుడు .రాజీవ్ ప్రతాప్ రూడీ ప్రవేశ పెట్టనున్న ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో సుష్మా స్వరాజ్ ప్రత్యేక తెలంగాణాఏర్పాటుకోరుతూ ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు నోచుకోలేదు. తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య మానసిక అనుబంధం ఏర్పడలేదని రూడీ తన తీర్మానంలోపేర్కొన్నారు. అన్ని రంగాల్లో తమకు అన్యాయం జరుగుతోందన్న భావన తెలంగాణ ప్రజల్లో పాతుకొని పోయిందని ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్న తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నిజం చేయటానికి కేంద్రం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని అయన చెబుతున్నారు..
v.j
.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Telangana, private, bill, in, rajya, sabha, by, BJP, , Political, Entertainment, Telugu
|