దర్శకుడు తేజ నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మడి సాగుతున్న ఇంటి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా దర్శకుడు తేజ అయన కుటుంబ సభ్యులు మామ హై కోర్ట్ ను ఆశ్రయించారు. జూబ్లీ హిల్స్ పోలీసులు తమ పై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని హై కోర్ట్ కు వారు విజ్ఞప్తి చేశారు. తన ఇంటిని తేజ అయన కుటుంబ సభ్యులు ఆక్రమించుకున్నారని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తేజ పై కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 45 లో ఉంటున్న ఇంటికి సంబందించిన వివాదం తో తనకు తన భార్యకు బావమరిదికి ఎలాంటి సంబంధం లేదని ఆ ఇంటి వివాదం చదలవాడ శ్రీనివాస్ తన మామ పద్మనాభ రెడ్డికి మద్య సాగుతోందని తేజ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.ఇంటిని అమ్మడానికి మంచి పార్టీని చూస్తానని చెప్పడం తో నిర్మాత చలదలవాడ మాట నమ్మి అగ్రిమెంట్ ఆఫ్ సెల్ చేశామని ఆ పిటిషన్ లో వివరించారు. చదలవాడ ఫిర్యాదు ఆదరంగా కేసునమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపి వేయించాలని అయన విజ్ఞప్తి చేశారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Director, Teja, approached, H, C, , Political, Entertainment, Telugu
|