మావోయిస్ట్ లలో ప్రముఖ కీలక నేత శాఖా మురు అప్పారావు ఎన్‌కౌంటర్ లో హతం అయ్యారు. కీలక నేత శాఖమూరి హతం తో రాష్ట్రంలో మావోయిస్ట్ లకు గట్టి దెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నేరజాముల తండ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో శాఖమూరి హతమైన ఆయనను గుర్తించ డంలో జాప్యం జరిగింది. నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని పలు పోలిస్ స్టేషన్ ల పై మావోలు జరిపిన దాడుల వెనుక శాఖమూరి వ్యూహం ఉందని పోలీసు వర్గాలు చెప్పాయి. అలిపిరి వద్ద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ పైజరిగిన దాడిలో శాఖమూరి స్వయంగా పాల్గొన్నాడు. ఆ దాడిలో అదృష్టం బాగుంది చంద్ర బాబు ప్రాణాలతో బైట పడగలిగారు ఆడడిలో శాఖమూరి ప్రధాన నిందితుడు.. ఐ. ఫై. ఎస్. అధికారి వ్యాస్ మరో అధికారి ఉనేష్ చంద్ర హత్యా కేసుల్లోను అతను ప్రధాన నిందితుడు. శాఖమూరి అప్పారావు పై పది లక్షల రూపాయల రివార్డ్ ను ప్రకటించింది. 1993 లో అరెస్ట్ అయిన శాఖమూరి 2001 జనవరిలో బెయిల్ పై విడుదల అయిన తరువాత అగ్నతంలోని వెళ్లి పోయాడు. అప్పటి నుంచి పోలీసులకు అయన ఎన్నడు చిక్కలేదు.ప్రభుత్వం జరిపినశంతి చర్చల్లో శాఖమూరి చాల కీలక పాత్ర పోషించాడు. ఆర్. కే రక్షణ కమిటీలో కూడా పని చేశాడు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Mavoyist, leader, Sakhamuri, encounter, , Political, Entertainment, Telugu
|