జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ తనను కలిసిన తెలంగాణా లంబాడిలా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్ కు వచ్చిన ఆమెను మాజీ పార్లమెంట్ సభ్యుడు రవీందర్ నాయక్ కలిశారు. ఆయన ఆద్వర్యంలో వచ్చిన లంబాడీ మహిళలు ఆమె ను కలిసి తమ సమస్యల పై ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని పేదలు వెనుకబడిన తరగతుల ప్రజల జీవన స్థితి గతుల్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. నెల 18 నుంచి 22 వరకు తమ కమిటీ వివిద ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరిస్తుందని పేర్కొన్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Ravinder, kaur, meets, Tribal, ladies, , Political, Entertainment, Telugu
|