రాష్ట్రం విడిపోకుండా సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం మరింత అభివృద్ది చెందుతుందన్న అభిప్రాయాన్ని స్వర్గీయ ఎన్. టి. ఆర్. సతీమణి లక్ష్మి పార్వతి అభి ప్రాయపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా తో మాట్లాడారు. రాష్ట్రం ముక్కలు చెక్కలు కారాదని తిరుమలేశుని మొక్కు కున్నానని దాన్ని తీర్చుకోవడం కోసం త్వరలో తాను త్వరలో అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లనున్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. ఉండి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు.చంద్రబాబు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపి ఉంటె అయన పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:Lakshmi, parvathi, wishes, united, state, , Political, Entertainment, Telugu
|