తెలంగాణా ప్రాంతంలో తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర సమితి మద్య రాజకీయ ఆదిపత్య పోరు బాగా ముదిరింది. జే. ఎ. సి.నుంచి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బైటికి వచ్చింది. శుక్రవారం అర్దరాత్రి తెలంగాణా జే. ఎ. సి తెలుగుదేశం పార్టీని జే. ఎ. సి. నుంచి బహిష్కరించింది. ఈ పరిణామాల వల్ల తెలంగాణా ప్రాంతంలో తెలంగాణా రాజకీయ జే. ఎ. సి. మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణా జే. ఎ. సి. అంటే ఇపుడు టి. ఆర్. ఎస్. అనే అనుకోవాలి. ఇంకోరకంగా చెప్పాలంటే ఒకవేళ శ్రీకృష్ణ కమిటి తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి సిఫార్స్ చేసే పక్షంలో మొత్తం క్రెడిట్ టి. ఆర్. ఎస్. కే. దక్కాలి అన్న ఆలోచన కూడా ఉంది ఉండవచ్చు. తమతో కాంగ్రెస్ లేదని జే. ఎ. సి మొన్న తేల్చి చెప్పింది. దాన్ని కాంగ్రెస్ పార్టికి చెందినా తెలంగాణా నేతలు ఖండించలేదు. దాన్ని బట్టి జే. ఎ. సి. పై కాంగ్రెస్ కు కూడా నమ్మకం లేదని చెప్పాలి.
తెలంగాణా ప్రాంతంలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని రాజకీయంగా బలహీన పరచడం కోసం టి. ఆర్. ఎస్. చేసిన ప్రయత్నాలు ఎ మాత్రం ఫలించలేదు. చంద్రబాబు ను వ్యతిరేకించి టి. డి. పి. నుంచి బైటికి రావాలని తెలంగాణా టి. డి. పి. నేతలపై టి. ఆర్. ఎస్. జే. ఎ. సి. రూపంలో విపరీతమైన వత్తిడి తీసుకోని వచ్చింది. అయిన వారు మాత్రం దానికి లొంగలేదు. చంద్రబాబును వాదులు కోవడం కుదరదని తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకోని రావడం సాద్యం కాదని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం అంతకన్నా కుదరదని గ్రహించిన టి. ఆర్. ఎస్. జే. ఎ. సి. పేరిట తెలుగుదేశం పార్టీని దూరం ఉంచడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. కాంగ్రెస్ వైఖరిని మాత్రం జే. ఎ. సి. పట్టించుకోవడం లేదు. తెలంగాణా ఇచ్చిన తెచ్చిన కాంగ్రెస్ వల్లనే సాద్యం అవుతుందని గ్రహించిన టి. ఆర్. ఎస్. జే. ఎ. సి.కాంగ్రెస్ విషయం లో కాస్త మేతక వైఖరి ని అనుసరిస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం అలా కాదు. టి. డి. పి. ని అన్ని రకాలుగా దెబ్బతీయడానికే టి. ఆర్. ఎస్. ప్రయతిస్తోందని అర్థం అవుతోంది..
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:TDP, and, TRS, fight, in, peak, stage, Political, Entertainment, Telugu
|