ముఖ్యమంత్రి రోశయ్య వైఖరిలో వచ్చిన మార్పు చూసి అధికార ప్రతిపక్ష నేతలు ఆశ్చర్య పోతున్నారు. రోశయ్యలో ఇంతటి మార్పు ను తాము ఎప్పుడు చూడలేదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించిన తరువాత రోశయ్య లో చాల మార్పు వచ్చింది. గతంలో లాగా అయన విపక్షం పై ఆగ్రహం ప్రదర్శించడం లేదు. తనపై కానీ ప్రభుత్వం పై కానీ విమర్శలు గుప్పించిన ప్రధాన ప్రతి పక్షనేత చంద్రబాబు ఎంతగా రెచ్చ గొట్టిన రోశయ్య మాత్రం చాల సహనాన్ని ప్రదర్శిస్తూ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయడం తో చంద్రబాబు తో పాటు మిగిలిన నేతలు కూడా రోశయ్య లో ఇలాంటి మార్పు రావడాన్ని గురించి చర్చించుకుంటున్నారు.
గతంలో తనపై అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసే రేవంత్ రెడ్డి నాగంముద్దు కృష్ణమ మోత్కూ పల్లి తదితరులపై మంది పడేవారు. ఇపుడు ఎంతో శాంతంగా సహనం తో సభలో వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా రోశయ్యలో ఈ మార్పు వచ్చింది. రేషన్ కార్ల విషయంలో చద్రబాబు తీవ్రంగానే ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. మంత్రి జూపల్లి దాన్ని తిప్పి కొట్టారు. మద్యలో జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం రేషన్ కార్డుల విషయంలో తప్పులు జరిగినట్లు అంగీకరించడం అటు చంద్రబాబు ను ఇటు మంత్రి జూపల్లి కూడా ఆశ్చర్య పోయారు.
పొరపాట్లు తప్పులను అధికారులపై రుద్దనికి ప్రయత్నించారు. ప్రధాన ప్రతిపక్షం తో పాటు విపక్షాలతో ఘర్షణ వైఖరికి పోకుండా వారు చేసిన సూచనలను పరిశీ లిస్తామని చెప్పి వాతావరణం వేడెక్కకుండా చూస్తున్నారు. విపక్షాలు ప్రభుత్వ తప్పిదాలను ఇతి చిపినపుడు వాటిని సరిదిద్దడానికి రోశయ్య ప్రయత్నాలు చేస్తు న్నారు. ప్రతి పక్షం తో ప్రతి చిన్న విషయానికి గిల్లీకజ్జాలుపెట్టుకోకుండా చూసుకోవడం ఇక్కడ గమనార్హం.
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:What, is, C, M, Rosaiahs, strategy, , Political, Entertainment, Telugu