ప్రజారాజ్యం పార్టీ అధినేత మెగా స్టార్ చిరంజీవి ఎప్పుడు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావును గురించి ఆలోచించడం ఆయనతో తనను పోల్చుకోవడం లాంటివి చేస్తుంటారు. తాను రాజకీయాల్లోకి రావడానికి తనకు స్పూర్తి ని ఇచ్చిన వారిలో ఎన్. టి. ఆర్. కూడా ఒకరు అని కూడా చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు . రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత ఎందుకనో చిరంజీవి ప్రతి దానికి తనను ఎన్. టి. ఆర్. తో పోల్చుకొని చూసుకునే అలవాటును బాగానే పెంచు కున్నారని అనిపిస్తోంది.చిరంజీవి సినిమాల్లో తిరిగి నటించానున్నరన్న వార్తలు ఈ మద్య మరి ఎక్కువగా వినిపిస్తోంది. దానికి కొంతవరకు ఆయనే కారకులు కూడా. సినిమాల్లో నటించడం కోసమే తాను స్లిమ్ గ మారినట్లు నవుతూ మీడియా తో చెప్పడం తో ఉహాగానాలు మరింత ఎక్కువ అయింది. మాజీ మంత్రి జాన రెడ్డి చిరంజీవి ఆ మద్య కలుసుకున్నారు. వారిద్దరూ బైటికి వచ్చిన తరువాత జానా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన కుమారుడు చిరంజీవి రామ్ చరణ్ తో ఒక చిత్రాన్ని నిర్మించే విషయం గురించి మాట్లాడాలని తనను కోరడం తో తను చిరంజీవిని కలిసినట్లు అయన చెప్పారు. సినిమాలో నటించడం కోసమే తను స్లిమ్ గా మారినట్లు నవ్వుతు చెప్పారు.
తరువాత ఏమనుకున్నారో కానీ రాజకీయాల్లో విజయం సాధించాకే సినిమాల్లో నటించే విషయం గురించి పరిశీలిస్తానని పేర్కొన్నారు. మళ్లి అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం మీడియా చిరంజీవిని కలిసి అయన సినిమాల్లో నటించే అంశం గురించి కదిపింది. ఎన్. టి. ఆర్ ముఖ్యమంత్రి పదవిని అలకరించిన తరువాత ఆయన సినమాల్లో నటించారా అన్న సందిగ్దత తనకు ఉందని దాన్ని ఎవరైనా తీర్చగలర అని అడగడం తో ఎన్. టి. ఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత సినిమాలో నటించారని చెప్పడం తో తన అనుమానం నివృత్తి అయిందని చిరు పేర్కొన్నారు. అంటే ముఖ్యమంత్రి అయిన తరువాత నే చిరంజీవి సినిమాలో నటిస్తారేమో! అప్పటిదాకా సినిమాల్లో నటించే విషయం గురించి అలోచిన్చారేమో మరి. అయినా ప్రతిది ఎన్. టి. ఆర్ తో పోల్చుకోవడానికి ప్రయత్నించే బలహీనత నుంచి చిరంజీవి బైట పడటం మంచింది. కాదంటారా చిరు గారు !!
v.j
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:What, Chiranjeevi, had, in, his, mind, Political, Entertainment, Telugu