ఇవాళ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లను చూస్తే ప్రత్యర్థులకు కళ్లు బైర్లుకమ్మే పరిస్థితి ఉంది. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే అత్యధిక మెజార్టీని టీఆర్‌ఎస్ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. వైఎస్‌ఆర్ పేరిట ఉన్న రికార్డును సిద్దిపేట అభ్యర్థి టి.హరీష్‌రావు మంచిర్యాల నుంచి పోటీ చేసిన గడ్డం అరవింద్‌రెడ్డిలు బద్దలు కొట్టారు. 2009 ఎన్నికల్లో దివంగత సిఎం వైఎస్‌ఆర్‌కు 68800 మెజార్టీ దక్కింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఇది అత్యధిక మెజార్టీ. అయితే... ఈ ఉపఎన్నికల్లో హరీష్‌రావు(98858 మెజార్టీ) అరవింద్‌రెడ్డి(72922 మెజార్టీ)లు బద్దలు కొట్టారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ysr,record, Political, Entertainment, Telugu
|