ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుతో చర్చలు జరిపేందుకు ఇప్పటికీ తాను సిద్ధంగా ఉన్నట్టు విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. ఈ సర్వే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని భావించామన్నారు. అయితే తెలంగాణ సెంటిమెంట్‌కు ఆ ప్రాంత ప్రజలు పట్టం కట్టారన్నారు.
ఢిల్లీలో ఉన్న ఆయన ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆర్.జి ప్లాష్ టీవీ నిర్వహించిన సర్వే ప్రకారం ఫలితాలు రావడం మంచిదే అయినప్పటికీ ఒక కాంగ్రెస్ వాదిగా తనకు తీవ్ర నిరాశకు లోను చేశాయన్నారు.
ఇకపోతే.. ఈ ఎన్నికల ఫలితానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముడిపెట్టకూడదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ కంటే రాజీనామా చేసిన అభ్యర్థుల పట్ల సానుభూతి ఎక్కువగా ఉండటం వల్ల వారు విజయభేరీ మోగించారన్నారు.
అదేసమయంలో ఉప ఎన్నికలు జరిగిన 12 స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించడం తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నట్టు కాదన్నారు. గతంలో కేసీఆర్ 2.15 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన మెజార్టీకి కేవలం 15 వేలకు పడిపోయిందని గుర్తు చేశారు.
అందువల్ల ఎన్నికల ఫలితాలకు తెలంగాణవాదానికి ముడిపెట్టరాదన్నారు. అదేసమయంలో రాష్ట్ర ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఒక చోట కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులోభాగంగా కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు లగడపాటి రాజగోపాల్ తెలిపారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:lagadapati,comments, Political, Entertainment, Telugu
|