తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం ఊహించిందేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై తాము నిరాశపడడం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికల్లో జయాపజయాలు సహజమని ఆయన అన్నారు.
తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన చెప్పారు. అయితే తాము తెలంగాణను తెచ్చే పరిస్థితిలో లేమని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని భవిష్యత్తులో కూడా ఆదరిస్తారని ఆయన అన్నారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:trs,comments, Political, Entertainment, Telugu
|