అభివృద్ది నినాదంతోఅత్యున్నత స్థానంతో ఉపఎన్నికల్లో ప్రజలముందుకు వచ్చిన పిసిసి అధినేత డి.శ్రీనివాస్‌కు పరాభవం ఎదురైంది. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న డిఎస్ ఆశలు ఆడియాశలయ్యాయి.అర్బన్ ప్రజలు డి.శ్రీనివాస్‌ను తిరస్కరించారు.తెలంగాణ నినాదంతో పదవి త్యాగం చేసిన యెండలకే పట్టం కట్టారు.గెలుపు కోసం సర్వశక్తులు ప్రయోగించిన డిఎస్ ప్రయోగం ఫలించలేదు.జాతీయరాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్ అర్బన్ స్థానం ఎట్టకేలకు బాజపా వశమైంది.ఉపముఖ్యమంత్రిని అవుతానని ఆశించిన డిఎస్ ఆశలపై ప్రజలు నీళ్ళు చల్లారు.చివరికంటా ఉత్కంఠ నెలకొన్న అర్బన్ స్థానం డిఎస్‌కు రెండవసారి పరాజయాన్ని మూటగట్టింది.పిసిసి అధ్యక్ష హోదాలో డిఎస్ రెండవసారి ఓటమిపాలయ్యారు.2004లో జరిగిన ఎన్నికల్లో చేతులారా ఓటమిని మూటగట్టుకున్న డిఎస్ ఉపఎన్నికల్లో ప్రయోగించిన వ్యూహాలు ఫలించలేదు.రెండుసార్లు భాజపా అభ్యర్థి లక్ష్మినారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు.ప్రస్తుతం డిఎస్ రాజకీయ భవిష్యత్‌పై పరిశీలకులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.బలమైన తెలంగాణ సెంటిమెంట్ ముందు డిఎస్ పోటీకి దిగడం తొలివైఫల్యంగా పేర్కొంటున్నారు.
దాదాపు గెలుపు ఖాయమని భావించినప్పటికి అర్బన్ ప్రజల తీర్పు మరోసారి డిఎస్‌ను డీలా చేసింది.ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసింది.జిల్లా కాంగ్రెస్‌లో నిరుత్సాహాన్ని నింపగా అర్బన్ కాంగ్రెస్‌లో ఆందోళనను రే కెత్తిస్తుంది.ఇదిలావుంటే ఉపఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోవాలని ఆరాటపడ్డ శ్రీనివాస్‌కు అధిష్టానం అడ్డుపడి ంది.దీంతో పాటు తదనంతరం రాజ్యసభ సభ్యునిగా నియామకం కోసం అధిష్టానం వద్ద కసరత్తు చేసినప్పటికి కలిసిరాలేకపోయింది. ఎమ్మెల్సీ దక్కించుకొని రాష్ట్ర కెబినెట్‌లో మంత్రి పదవిని లేదా ఉపముఖ్యమంత్రి పదవినిదక్కించుకోవాలని చేసిన వ్యూహాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యతిరేకించడంతో అవకాశం చేజారింది.ఈ క్రమంలో అర్బన్‌లో ఉపఎన్నికలు అనివార్యం కావడంతో ఎలాగైన గెలుపొందాలని డిఎస్ ఎత్తులు వేశారు.అయితే ప్రజలు తెలంగాణవాదానికే పట్టం ట్టడ ంతో మరో నాలుగెళ్ళు డిఎస్ రాజకీయ భవిష్యత్‌పై సందిగ్దం ఏర్పడింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:DS,position, Political, Entertainment, Telugu
|