ఒకవైపు అర్బన్‌లో ఓటమితో తీవ్ర నిరాశకు గురైన డిఎస్‌కు మరో నెలరోజుల్లో పిసిసి పదవిని కోల్పోనున్నారు.రెండవసారి 2008లో పిసిసి సారథి పగ్గాలు చేపట్టిన డిఎస్ పద వికాలం 2010 ఆగస్టులో ముగియనుంది.నిన్నటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను శాసించిన డిఎస్‌కు పిసిసి అధ్యక్ష పదవి కోల్పోవడం మరోరకంగా కష్టంగా పరిణమించనుంది.ఒకేసారి అర్బన్‌లో ఓటమి వెంటనే పిసిసి సారథి పదవిని కోల్పోవడంతో జాతీయరాష్ట్ర కాంగ్రెస్ కార్యకలాపాల్లో డిఎస్ ప్రభావం తగ్గనుందని పరిశీలకుల అభిప్రాయం.ఈ క్రమంలో డిఎస్ రాజకీయ భవిష్యత్‌పై జోరుగానే ఉహాగానాలు సాగుతున్నాయి. దాదాపుగా ఏడాది కాలంగా డిఎస్ వేస్తున్న ఎత్తులన్ని ఎదో రకంగా చిత్తు కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో డిఎస్ వర్గంలో నిరాశను నింపింది
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:DS,position, Political, Entertainment, Telugu
|