నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల్లో పిసిసి చీఫ్ డి.శ్రీనివాస్ పరాభవానికి అనేక శక్తుల పట్టుదలకృషి పనిచేసింది.తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వివిధ వర్గాలు డిఎస్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకుని డిఎస్‌ను ముప్పు తిప్పలు పెట్టాయి.ప్రత్యేకించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుకెసిఆర్ కూతురు కవిత కృషికష్టం బాగా పనిచేసింది.బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మినారాయణకు మద్దతుగా రంగంలోకి దిగిన ఆమె అనేక దఫాలుగా డిఎస్‌పై దండెత్తింది.డిఎస్‌ను గుక్క తిప్పుకోకుండా చేసిన ఆమె డిఎస్ వేసిన ప్రతి అడుగులోను తప్పిదాలను లెక్కించిన కవిత కులసంఘాలపై డిఎస్ దృష్టిసారించడంతోనే కవిత అప్రమత్తమైంది.ఇదే అంశంపై ఆధారాలతో సహా ఈసికి ఫిర్యాదు చేసిన కవిత డిఎస్ స్పీడుకు బ్రేకు వేసింది.నిజామాబాద్‌లోనే మకాం వేసి శిభిరం ఎత్తుగడలను అడ్డుకుంది.డివిజన్‌ల వారిగా ప్రచారంలో పాల్గొని తెలంగాణ వాదాన్ని ఇంటింటికి తీసుకెళ్ళింది.నామినేషన్ మొదలుకుని పోలింగ్ వరకు కీలకపాత్ర పోషించిన కవిత డిఎస్ అనుచరుల సింహస్వప్నంగా మారింది.
కానిస్టేబుల్ బార్యపై ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తల అఘాయిత్యంపై ధ్వజమెత్తి కేసును నీరుగార్చేందుకు యత్నించిన ఎస్‌ఐపై చర్య తీసుకునే వరకు డిపిఓ ఎదుటే బైఠాయించింది. కవిత కదలికలు ప్రచారంతో విస్తుపోయిన కాంగ్రెస్ శ్రేణులు ఆమెను జిల్లానుండి పంపించేందుకు యత్నించి బోల్తాపడ్డారు.తాను ఇందూర్ జిల్లా కోడలినంటూ సెంటిమెంట్‌ను జోడించడంతో పాటు తాను స్థానికురాలినని స్పష్టం చేసింది.కవితతో పాటు న్యాయవాదుల పాత్ర ఎండల గెలుపులో కీలకమయ్యింది.ఉద్యోగులు తెరవెనక మద్దతు తెలిపిన న్యాయవాదులు మాత్రం డిఎస్‌కు ఎదురొడ్డి నిలిచారు.న్యాయవాదుల బలం యెండలకు మరింత బలాన్ని నైతిక మద్దతును కూడగట్టింది.ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుండి న్యాయవాదులు బహిరంగంగానే డిఎస్‌పై ఎదురుదాడి ప్రారంభించారు.తెలంగాణ న్యాయవాదుల జెఎసిఓయూ విద్యార్థులు యెండలకు మద్దతునివ్వడంతో పాటు డిఎస్‌కు అడుగడుగునా ఇబ్బందులను సృష్టించారు.డిఎస్ డబ్బు పంచినా అది తమదేనని తీసుకుని ఎండలను గెలిపించాలని చేసిన ప్రచారం పనిచేసినట్లు తెలుస్తోంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:kcr,daughter,kavitha, Political, Entertainment, Telugu
|