తెలంగాణ కోసం మరో విద్యాకుసుమం రాలిపోయింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఇషాన్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించాలని తెలంగాణవాదులకు పిలుపునిస్తూ వంటికి నిప్పంటించుకుని ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఆత్మహత్య చేసుకున్నాడు.ఉపఎన్నికల ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఇషాన్ కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించాలని తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం బసంత్‌నగర్‌కు చెందిన ఇషాన్ ఉన్నత విద్యకై త్వరలో అమెరికా వెళ్లాలనే ప్రయత్నంలో జిఆర్‌ఇ కి కూడా సమాయత్తమవుతున్నాడు.
ఇంకా సూసైడ్ నోట్‌లో... తన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించవద్దని ఓయూ నుంచి గన్‌పార్క్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లాలని రాశాడు. తెలంగాణ ఉప ఎన్నికల్లో డిఎస్ ఓడిపోవాలని భారీ మెజార్టీతో రాజీనామా చేసినవారు గెలవాలని అలా జరిగితే ఆత్మబలిదానం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని మొక్కు తీర్చుకునేందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఇషాన్ లేఖలో పేర్కొన్నాడు. డిసెంబరు కంటే ముందే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని సూసైడ్ లేఖలో ఇషాన్ చివరి కోరిక కోరాడు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:ou,student, Political, Entertainment, Telugu
|