అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఎత్తుగడ ప్రధాని పర్యటనలో సుస్పష్టంగా కనిపించింది.. మన్నవరం ప్రాజెక్టు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయాల శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధాని రెండు చోట్లా 40 నిమిషాల పాటు ప్రసంగించారు. దాదాపు ఇరవై నిమిషాల పాటు వైఎస్‌ను పొగడడమే పనిగా పెట్టుకున్నారు.. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రఫుల్ పటేల్ రాష్ట్ర మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డీ వైఎస్ జపం చేశారు. వారు వైఎస్ గురించి మాట్లాడిన ప్రతిసారీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చప్పట్లు కొట్టడం కనిపించింది. ప్రధాని పర్యటనకు వైఎస్ గ్రూపు గైర్హాజరయింది. షెడ్యూల్ ప్రకారం జరిగినప్పటికీ వెళ్లేటప్పుడు మాత్రం అర్ధగంట ఆలస్యంగా పర్యటన సాగింది. జగన్ ఓదార్పుయాత్ర నుంచి కాంగ్రెస్ నేతలను ప్రజాప్రతినిధులను అభిమానులను మళ్లించేందుకు ఢిల్లీ అధిష్టానం వ్యూహం పన్నింది. ప్రభుత్వమే ఓదార్పు యాత్ర చేపడుతుందని ప్రకటించింది. సంస్మరణ సభ కూడా ప్రభుత్వం తరపునే చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఒక రోజు ముందుగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు విచ్చేశారు. మన్నవరాన్ని మన్మోహన్‌పురమని ఎంపి చింతామోహన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే మన్నవరాన్ని వైఎస్‌ఆర్ పురంగానే నామకరణం చేస్తూ ప్రధాని రాజశేఖరరెడ్డి సేవలను పదేపదే కొనియాడారు.
వైఎస్‌ఆర్ ఒంటరి కాదని కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తేనని పదేపదే ప్రసంగాల ద్వారా పరోక్షంగా తెలియజేయడం గమనార్హం. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ఫ్లెక్సీల్లో వైఎస్.రాజశేఖరరెడ్డి రెండోసారి గెలిచిన సందర్భంగా ఆనందంతో అప్పటి ఆర్థికమంత్రి రోశయ్యను కౌగిలించుకుని ఉన్న ఫొటో ఏర్పాటు చేశారు. 'రాజశేఖరా... నీ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ'ని కొనసాగిస్తాం అంటూ నినాదాలు రాసి ఉండడం గమనార్హం. 'వైఎస్ జపం' డైరెక్షన్ అంతా 'అమ్మ' అధినేతదేనని సమాచారం.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:pm, speaks, about, ysr, Political, Entertainment, Telugu
|