ఐపిఎల్ కుంభకోణంలో ఇరుక్కుని పదవి నుండి ఉద్వాసనకు గురైన లలిత్ మోడీ ఆర్థిక అవకతవకలు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఐపిఎల్ ప్రసార హక్కుల కోసం మారిషస్‌కు చెందిన వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్‌జి) సంస్థ అందచేసిన రూ. 80 కోట్ల ముడుపులతో మోడీ ఏకంగా ఒక ప్రైవేట్ జెట్ విమానాన్నే కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన సమన్లను తప్పించుకునేందుకు లండన్ వెళ్లిపోయిన మోడీని పట్టుకోవటం ఎవరి తరమూ కావటం లేదట. ఆదాయపు పన్ను శాఖ సమన్ల నుండి తప్పించుకునేందుకు మోడీ వేసిన ఎత్తు ఆయన సహచరులను ఇరకాటంలోకి నెట్టింది. మోడీ కార్యదర్శి దీపా పాలేకర్‌ను ఆదాయపుపన్ను శాఖ గత వారం ముంబయిలో విచారించింది. ప్రైవేట్ జెట్ విమానం కొనుగోలుకు రూ.80 కోట్లు ఎక్కడి నుండి వచ్చాయో తెలియచేయాలని ఐటి వర్గాలు ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఐపిఎల్ ప్రసార హక్కుల ఒప్పందాన్ని ఖరారు చేయటం కోసం మధ్యవర్తి అయిన సోనీ టీవీ మాజీ సంస్థ అయిన మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్‌ఎం)కు డబ్ల్యుఎస్‌జి చేసిన చెల్లింపుల వ్యవహారం కోసం మోడీ ఈ విమానాన్ని తరచూ వినియోగించే వాడని తెలుస్తోంది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:modi, helicopter, Political, Entertainment, Telugu
|