మూమూలే.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో సానియా మీర్జా కథ ఆదిలోనే ముగిసింది. అన్‌సీడెడ్‌ను ఓడించి తొలిరౌండ్‌ను అధిగమించి న ఈ హైదరాబాదీ.. రెండోరౌండ్‌లో రష్యాకు చెందిన సీడెడ్ భామ పావుల్యుచెన్‌కోవా చేతిలో బోల్తా పడింది. గంటన్నరలోపే ముగిసిన ఈ పోరు లో ప్రత్యర్ధికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన సానియా 2-6 4-6తో వరుససెట్లలో ఓటమిపాలైంది.
2005 తర్వాత తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో క్వాలిఫయింగ్ రౌండ్లు ఆడిన సానియా.. గతంలో ఇదే హార్డ్‌కోర్టుపై తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా నాలుగోరౌండ్ చేరడం విశేషం.
డబుల్స్‌లో పేస్ జోడీ ఔట్..డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత ఆటగాడు లియాండర్ పేస్ లుకాస్ డ్లౌహీ (చెక్) జోడీ ఆరంభంలోనే కంగుతింది. తొలిరౌండ్‌లో పేస్ జంటను 6-7(7) 6-3 6-4తో మార్టిన్ డామ్ (చెక్) ఫిలిప్ పొలాసెక్ (స్లోవేకియా) ద్వయం చిత్తుచేసింది.
మరో భారత ఆటగాడు రోహన్ బోపన్న-ఖురేషీ (పాకిస్తాన్) జో డీ 6-3 7-6 (7)తో అమెరికా జంట బ్రయాన్ బటిస్టోన్ రైలర్ డీ హార్ట్‌ను ఓడించి రెండోరౌండ్ చేరింది. గట్టెక్కిన నడాల్: ఈ టైటిల్‌తో 'కెరీర్ గ్రాండ్‌స్లామ్' ఆటగాడి రికార్డును అందుకోవాలనుకుంటున్న స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ ఆదిలోనే తడబడ్డాడు. రష్యా ఆటగాడు తిమురాజ్ గబాష్విలితో జరిగిన తొలిరౌండ్‌లో నడాల్ 7-6 (7/4) 7-6 (7/4) 6-3తో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నాడు.
ఇవనోవిచ్ జోరు.. మహిళల్లో సెర్బియాకు చెందిన మాజీ నెంబర్‌వన్ ఇవనోవిచ్ తన జోరు కొనసాగిస్తూ 6-3 6-0తో చైనా సీడెడ్ భామ జీ జెంగ్‌ను ఓడించి మూడోరౌండ్ చేరింది. గిసెలా డుల్కోతో జరిగిన రెండోరౌండ్ మ్యాచ్‌లో అజరెంకా (బెలారస్) గాయంతో మధ్యలోనే వైదొలిగింది.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:sania, Political, Entertainment, Telugu
|