వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని సినీ నటుడు నరేష్ అన్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో ఆయన గురువారం వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాలు ఆశయాలు నెరవేరాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం అవసరమని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడ్ని మరిచిపోలేమని ఆయన అన్నారు. విజన్ వల్ల ప్రతి పేదవాడి గుండెల్లో వైయస్ ను నిలిచిపోయేలా చేసిందని ఆయన అన్నారు.
ఇడుపులపాయ నవీన దేవాలయంగా రూపుదిద్దుకుంటుందని ఆయన అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు ఇతర పథకాలు వైయస్ ను చిరకాలం నిలిచిపోయేలా చేశాయని ఆయన అన్నారు. తిరుపతిలాగా ఇడుపులపాయ కూడా దేవాలయంగా మారుతుందని ఆయన అన్నారు. వైయస్ మన ముందు భౌతికంగా లేకపోయినా దేవుడిగా మన ముందు ఉంటాడని ఆయన అన్నారు. వైయస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని జగన్ మిషన్ ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన అన్నారు
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:sr, naresh, comments, on, jagan, Political, Entertainment, Telugu
|