మంత్రులు ప్రాంతాలవారీగా మాట్లాడితే హైకోర్టుకు సుప్రీమ్ కోర్టుకు కూడా వెళ్లి వారి కళ్లు తెరిపిస్తానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారంనాడు హెచ్చరించారు. ఎం.పీ.లు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించవచ్చునుగాని మంత్రులు అలా కాదనివారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి మొత్తం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామన్నారని ఆయన గుర్తు చేశారు.
మంత్రులు తమ బాధ్యతలను విస్మరించరాదని ఆయన కోరారు. విద్యార్థులను కొందరు వేర్పాటువాదులు రెచ్చగొడుతుంటే అందరినీ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేయవలసిన మంత్రులు తామే ఆ గోతిలో పడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు తమ పద్ధతి మార్చుకోకపోతే వారిని మంత్రి పదవులనుంచి తొలగించేవరకూ నిద్రపోనని ఆయన చెప్పారు.
విద్యార్థులు ధైర్యంగా రేపు పరీక్షలు రాయడానికి రావాలని ఎవ్వరూ భయపడరాదని ఆయన అన్నారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన గ్రూప్-1 పరీక్షలను మరోసారి వాయిదా వేయించడానికి యత్నిస్తున్న వేర్పాటువాదుల ఆటలు క ట్టించాలని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఎ.పి.పి.ఎస్.సి. పరీక్షలను ఆపాలనుకుంటున్న వారిని మా భవిష్యత్తు ఎందుకు పాడుచేస్తున్నావని విద్యార్థులు ప్రశ్నించాలని ఆయన కోరారు. అటువంటివారి కుట్రలను భగ్నం చేస్తూ విద్యార్థులు తిరగబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Note: If you are seeing junk characters instead of the correct telugu characters, in your browser go to 'View->Encoding' and select the option 'Unicode (UTF-8)
Tags:lagadapati, comments, on, ministers, Political, Entertainment, Telugu
|